Pressure Cooker Movie Review | ప్రెషర్ కుక్కర్ మూవీ రివ్యూ

 ప్రెషర్ కుక్కర్ మూవీ రివ్యూ


మొదట ఈ సినిమా ట్రైలర్ చూడగానే కొంత డిఫరెంట్ గా అనిపించింది. సినిమా చూసిన తరువాత కూడా నేను satisfy అయ్యాను. ఈ సినిమాలో చదువు పూర్తయిన తరువాత వ్యక్తి జీవితాన్ని డైరెక్టర్ బాగా చూపించాడు. సాధారణంగా కాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగాలు చాలా తక్కువ మందికి వస్తాయి. చాలా మందికి మొదట్లో ఉద్యోగం రావడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఫ్రేషేర్స్. కానీ ప్రయత్నిస్తే ఏది సాధ్యం కాదన్నా విషయాన్ని డైరెక్టర్ బాగా చూపిస్తాడు. కధాపరంగా డైరెక్టర్ కొన్ని అంశాలను చాలా బాగా చూపిస్తాడు. నిరుద్యోగ సమస్యను, అమెరికాలో సెటిల్ అయిన పిల్లల తల్లిదండ్రుల పరిస్తితిని, తల్లిదండ్రులు తమ ఇష్టాన్ని తమ పిల్లలపై ఏ విధంగా రుద్దుతరాన్న విషయాన్ని బాగా చూపిస్తాడు.

హీరో తండ్రికి తన కొడుకుని అమెరికా పంపించాలని కోరిక ఎందుకంటే అతని బంధువుల పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు కాబట్టి. కానీ హీరో కి తన ప్రాజెక్ట్స్ మీద ఆసక్తి. ఇంకా వీసా కోసం ప్రయత్నిచిన ప్రతిసారి రిజెక్ట్ అవుతుంది.

ఫైనల్ గా హీరో తనకున్న ఆసక్తి పరంగా ఎలా ఉద్యోగం తెచ్చుకుంటాడో, హీరో తండ్రి తన కోరికలను తన పిల్లపై రుద్దడం 

తప్పని ఎలా తెలుసుకుంటడో, పిల్లలు అమెరికాలో సెటిల్ అవ్వడం అంటే తన సక్సెస్ కాదని వృద్దుడైన తనికెళ్ళ భరణి ఎలా 

తెలుసుకుంటడో సినిమా చివరలో బాగా చూపిస్తాడు.

Post a Comment

0 Comments