The Time Machine | టైం మెషిన్ మూవీ రివ్యూ

The Time Machine


            ఈ టైటిల్ చూసినప్పుడు ఈ సినిమా బాగుంటుందని అభిప్రాయం కలిగింది. కానీ ఈ కథకు మూలం అన్ని సినిమాల్లో లాగానే లవ్ స్టోరీ పైన బేస్ అయి ఉండడం కొంత నిరాశను కలిగించింది. హీరో ఒక ప్రొఫెసర్. అతనికి వాచెస్ మీద, ఫోటాన్ ఎనర్జీ మీద ఆసక్తి. ఎప్పుడు వాటిపైనే తన ఆలోచనలు. హీరో కి లవర్ కూడా ఉంటుంది. ఒక రోజు సాయంత్రం ఆమెను కలవడానికి వెళ్తాడు. దురదృష్టవశాత్తు కొన్ని క్షణాల తర్వాత ఒక దొంగ  వలన ఆమె తన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. దాంతో హీరో కష్టపడి టైం మెషిన్ ని తయారు చేస్తాడు. మరలా అదే కాలానికి వెళ్లి ఈ సారి ప్లేస్  మారుస్తాడు. కానీ ఒక గుర్రపు బండి వచ్చి ఆమెని ఢీకొనడం వలన ఆమె మరలా చనిపోతుంది. అప్పుడు హీరో కి అర్ధం అవుతుంది. తను ఎన్నిసార్లు ఆమెకోసం టైం ట్రావెల్ చేసినా  ఆమె అన్నిసార్లు చనిపోతుంది అని. గతాన్ని మార్చాలని అతను టైం ట్రావెల్ చేస్తుంటాడు. అతని ప్రశ్నకు సమాధానం 2700 సంవత్సరంలో దొరుకుతుంది. అప్పటికే భూమి శిథిలావస్థలో ఉంటుంది. ఈ సినిమాలో ఎక్కువగా విజువల్ గ్రాఫిక్స్  చూడలేము కానీ పర్వాలేదు. ఎక్కడ బోర్ అనిపించకుండా మాత్రం ఉంటుంది.

Post a Comment

0 Comments