అశ్వని
ఈ
సినిమా మొదట ఒక సీరియల్ advertisement లో చూసాను. అప్పుడే ట్రైలర్ బాగా నచ్చింది.
ఇలాంటి రియల్ స్టోరీస్ మనుషులలో ఉత్సహాన్ని పెంచుతాయి. పిల్లలో ఉన్న ఆసక్తిని,
టాలెంట్ ని గుర్తించడం టీచర్స్ కర్తవ్యం. కానీ మన విద్య వ్యవస్థ అలా లేదు. సరే
సినిమాలోకి వచ్చేస్తే అశ్వనిఒక నిరుపేద కుటుంబానికి’ చెందినది.
ఒకసరి
కోచ్ ఆమె పరుగును గమనిచడం జరుగుతుంది. ఒక తండ్రిలా ఆమెను ప్రోత్సహించి ట్రైనింగ్
ఇవ్వడం జరుగుతుంది. మొదట అశ్విని కోచ్ ని నేగ్లేట్ చేయడం జరుగుతుంది. కానీ జాబు
పోవడం, ఆయన కూలి పని చేస్తూ కూడా ఆ డబ్బులతో ఆమెకు ట్రైనింగ్ ఇవ్వడం చూసి చలించిపో
తుంది. పట్టుదలతో ప్రాక్టీసు చేయడం వల్ల స్టేట్ రౌండ్ లో మొదట స్థానం లో వస్తుంది. తరువాత పి టి ఉషను గెలిచి నేషనల్స్ లో పాల్గొంటుంది. ఆ తరువాత
ఇంటర్నేషనల్ రన్నింగ్ కాంపిటీషన్ లో కూడా పాల్గొంటుంది. ఇది అంత సులభంగంగా
జరగలేదు. ప్రత్యద్ర్డుల ఒత్తిడిలోనూ తన పట్టుదలను విడువలేదు.
ఆశ్చరం
ఏమిటంటే ఈ సినిమాలో నటించిన అశ్వని నిజంగానే స్పోర్ట్స్ ప్లేయర్.
0 Comments