The Mummy Movie Review | మమ్మీ

The Mummy


ఈవిల్ డెడ్ సినిమాలతో పోల్చితే ఈ సినిమాలు కొంచెం భిన్నమైనవి. నాకు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా అనిపించింది Tom cruise. ఎందుకంటే అతని సినిమాలు ఎక్కువ శాతం అడ్వెంచర్స్ ని కలిగి ఉంటాయి. ఈ సినిమాలో ఎక్కువగా ఈజిప్ట్ నాగరికతకు, వాటికి సంబంధించిన లిపి, శిలలు, మమ్మీలను చూడగలుగుతాము.

కథ పరంగా ఎక్కువ ట్విస్ట్ expect చేయలేము. కానీ  మమ్మీలను కూడా  మనుషులు ఎలా అదుపు చేయవచ్చు అనేది ఈ సినిమాలో బాగా చూపెడతారు. ఈ సినిమా కథకి మొదలు ఎక్కడంటే వారసత్వం గురించి. ఒక రాజ్యంలో రాజుకి సంతానం లేకపోవడం వల్ల అతని చెల్లెలికి వారసత్వం సంక్రమించే అవకాశం ఉంది. కానీ  అంత లోనే రాజుకి సంతానం కలుగుతుంది. దాంతో ఈర్ష చెందిన అతని చెల్లెలు దుష్ట ఆత్మలతో చేతులు కలిపి రాజుని, అతని సంతానాన్ని చంపుతుంది. అక్కడ రాజా మాంత్రికులు ఆమెను మంత్రాలతో బంధించి మమ్మీ గా మారుస్తారు.

పురావస్తు శాఖల తవ్వకాలలో ఈ మమ్మీ  బయటపడుతుంది. అక్కడి నుండి Tom cruise actions వీక్షించడం జరుగుతుంది. ఈ పోరాటంలో Tom cruise రాక్షసుడిగా మారుతాడు. అది కూడా మనసున్న రాక్షసుడిగా.

Note: you may watch this movie by checking this website

https://www.justwatch.com/

Post a Comment

0 Comments