Replicas Movie Review

Replicas


సైన్స్ ఫిక్షన్ మూవీస్ లలో ముఖ్యంగా మెదడు మీద జరిగే పరిశోధనలు చాలా అబ్బురపరుస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ఈ replicas. అసలు ఈ సినిమా సారాంశం ఏమిటంటే మనిషి  దేహానికి మరణం ఉంటుంది. కానీ మెమొరి కి కాదు. మానవుల బ్రెయిన్ డేటా ను ఒక ఇనుప అవయవాలు, సింథటిక్ బ్రెయిన్ కలిగిన రోబో కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ మొదట్లో బ్రెయిన్ మాత్రమే కాన్ఫిగర్ చేయడంవల్ల డేటా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రోబోట్ తన అవయవాలను చూసుకుని తనను తానే బ్రేక్ చేసుకుంటుంది.

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా అబ్బురపరుస్తాయి. బ్రెయిన్ డేటాను స్టోర్ చేసే పరికరాలు, ల్యాబ్, న్యూమరాలజీ కి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్, శరీరాన్ని భద్రపరిచే కెమికల్ టాబ్స్ ఈ సినిమాలో  బాగా చూపిస్తారు.

ఒకానొక సమయంలో హీరో ఫ్యామిలీ కార్ యాక్సిడెంట్ లో చనిపోతారు. వారిని తన ఎక్స్పరిమెంట్ తో ఎలా బ్రతికిస్తాడు, అలాగే  మొదట విఫలం అయినా రోబోట్ experiment మరల ఎలా ఎలా సక్సెస్ చేస్తాడు అన్న దానిపైనే కథ నడుస్తుంది.

ఈ సినిమా వల్ల నాకు తెలిసింది ఏమిటి అంటే ఈ ప్రయోగం వల్ల మనిషి చనిపోవడం జరగదు. అంటే మనిషి ముసలివాడై,  కృషించి చనిపోవాలే తప్ప , కార్ యాక్సిడెంట్, విషం లాంటి విషయాలలో మనిషి చనిపోవడం జరగదు. అంటే మన పురాణాలలో శుక్రాచార్యుడు దగ్గర ఉన్న మృత సంజీవని లాంటిది.

Note: you may watch this movie by checking this website

https://www.justwatch.com/

Post a Comment

0 Comments