ShaKuni Movie Review | శకుని మూవీ రివ్యూ

శకుని

కంప్యూటర్ ముందు కూర్చోని బుర్ర వేడెక్కిపోయింది.కాసేపు రిలాక్స్ కోసం youtube లో చిన్న చిన్న బిట్స్ చూస్తున్నాను. అప్పుడే రాజతంత్రం, స్కీన్, కష్టాలనుండి అవకాశాలను ఎలా చూడవచ్చో ఆ సీన్ చూపించింది. ఇంకా ఆగలేక మొత్తం సినిమా చూసాను. అదే శకుని.

కార్తిక్ నటించిన ఆ సినిమాలో బాగా రాజతంత్రం గురుంచి చూపిస్తారు. కార్తిక్ ఇల్లు ఒక రైల్వే ప్రాజెక్ట్ లో భాగంగా తీసేయవలసి వస్తుంది. దాని కోసం ముఖ్యమంత్రిని కలసి అడుగుతాడు. కానీ ముఖ్యమంత్రి అనుకూలంగా లేక వారించడంతో తన ఇంటిని ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించుకొంటాడు. ఆ ప్రయత్నంలోనే ప్రత్య్న్న యుద్దాన్ని ఫ్రారంభిస్తాడు. ఒక వ్యక్తిని మేయర్ చేయడం, చెట్టు కింద స్వామిజిని పెద్ద బాబాను చేయడం, ఒక రాజకీయ పార్టికి బలాన్ని ఇవ్వడం చేస్తాడు. ఒక్కో దశలో తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు, మాటలు ప్రేక్షకుల కళ్ళను కట్టిపడేశాల ఉంటాయి. వాస్తవ పరిస్తుతులకు దగ్గరగానే ఉండేటట్లుగా కథ నడుస్తుంది. ఒక సామాన్యుడు తలచుకుంటే ఏమైనా సాధించగలడని చూపించడం నాకు బాగా నచ్చింది.



Post a Comment

0 Comments