The Power Of Subconscious Mind

The Power Of Subconscious Mind



Joseph Murphy రాసిన ఈ బుక్ నా దృష్టిలో చాలా అద్బుతమైనది. ఎందుకంటే  conscious mind

కంటే subconscious mind ఎంత శక్తివంతమైనదో ఈ బుక్ లో రచయిత బాగా వివారించారు. ఈ బుక్ లో కొన్ని వాక్యాలు మన జీవితంలోని అంశాలకు దగ్గరగా ఉంటాయి. ఉదాహరణకు తెల్లవారు జామున వచ్చిన కలలు కొన్ని రోజుల తరువాత మన నిజజీవితంలో జరగడాన్ని తరచుగా చూస్తూనే ఉంటాం.

ఈ పుస్తకాన్ని చదివినపుడు నాకు చాలా విషయాలు తరసపడినట్లు అనిపించాయి.

1.     What you write inside, that you experience outside

మనం ఏదైతే ఆలోచిస్తమో అదే జరుగుతంది. యత్బవం తత్బావతి. ఒక సమస్య గురుంచి పదే పదే ఆలోచించడం వల్ల కొన్ని రోజులకి ఆ సమస్య మరింత జటిలం అవుతుంది. అదే సమస్య పరిష్కారాన్ని పదే పదే ఆలోచిస్తే కొన్ని రోజులకి ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.

2.     Your thoughts are experiences

నీ ఆలోచనలే నీకు అనుభవాలుగా మారుతాయి. దిన్ని ఒక  pubg game  తొ పోల్చి చూద్దాం. pubg game ఆడుతూ అందులో పూర్తిగా లీనం అయినవాళ్ళు నిద్రపోయినప్పటికి వారి మైండ్ అదే ధ్యాస లో ఉంటుంది. దాని వల్లనే మనం న్యూస్ లో చూస్తుంటాం pubg ఆడి మనుషులను చంపినట్లు. అంటే ఆ గేమ్ మీద తనకున్న ఆలోచనలు తనకి అనుభవాలుగా మారాయి.

3.     Motion and emotion must be balance

మన కదలికలు, ఫీలింగ్స్ అనేవి బాలన్సుడ్ గా ఉండాలి. చెప్పేది ఒకటి చేసేది మరొకటి అయి ఉండకూడదు. మహా భారంతంలో చెప్పినట్లు స్తిత ప్రజ్ఞను కలిగి ఉండాలి. సంతోషానికి పొంగిపోకుండా, కష్టానికి క్రుంగిపోకుండా బాలన్సుడ్ గా ఉండాలి. అంటే ఏక్షన్ కి ఓవర్ ఏక్షన్ కి ఉన్న తేడా. ఇది కామెడీ విషయంలో తెలుస్తుంది. కానీ మన బ్రెయిన్ ను ట్రైన్ చేసే విషయంలో కీలకమైనది.

4.     Do the repeated affirmations

  మన చుట్టు ఉన్న పరిస్తితులు మనల్ని మనకు తెలియకుండా వాటికీ వశం అయ్యేలా చేస్తాయి. అంటే చిన్నప్పటి నుండి పాములను పట్టే వాళ్ళ కుటుంబంలో పెరిగిన వ్యక్తికి పాముతో భయం లేదు. కానీ అటువంటి జీవనానికి భిన్నంగా పెరిగిన వ్యక్తికి పామంటే భయం. ఇక్కడ తెలియాల్సింది ఏమిటంటే సమస్యను మేనేజ్ చేయడం, కంట్రోల్ చేయడం. అది రోజు చేసే positive repeated affirmations మీద ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు ఒకానొక సమయంలో నీటిలో బాగా మునిగి పోయి ఊపిరి ఆడని స్తితిలో ఆకస్మాత్తుగా ఎవరో అతన్ని కాపాడినపుడు అతనికి అ తరువాత నుండి నీళ్ళంటే భయం ఏర్పడుతుంది.

అతను ఈ Affirmations వాడి ఆ భయం నుండి భయటపడవచ్చు.

*. నాకు నీళ్ళంటే భయం లేదు.

*.  నేను బాగా స్విమ్ చేయగలుగుతున్నాను.

*. నేను చాలా సేపు నీటిలో ఉండగలుగుతున్నాను.

*. నేను ఊపిరిని కంట్రోల్ చేయగలుగుతున్నాను

ఇలా జరిగినట్లు ఊహించుకున్నపుడు subconscious mind affirmations ద్వారా ఏర్పరచిన  ఊహాలను నిజం అని నమ్ముతుంది. అప్పుడు శరీరానికి డానికి తగ్గట్టుగా సిగ్నల్స్ ఇస్తుంది.

5.     Subconscious  పనిచేసే సమయాలు

a.     ఉదయం

b.     రాత్రి పడుకునే సమయంలో

c.      ధ్యానం లో

d.     దేవాలయలో

Subconscious ని ఉపయోగించి

1.      సెక్సువల్ ఆలోచనల్ని పోగొట్టుకోవచ్చు

2.     ఆర్దిక సమస్యలను దూరం చేసుకోవచ్చు

3.     లక్ష్యాలకు చేరువ కావచ్చు

4.     సమస్యలను దూరం చేసుకోవచ్చు

Subconscious mind కి  affirmations ఇస్తూ బ్రెయిన్ ని ట్రైన్ చేయడం ఎంత ముఖ్యమో వాటిని నిలువరించే ఆలోచనలు, పనులను చేయకుండా ఉండడం అంతే ముఖ్యం.

అంటే సెక్సువల్ ఆలోచనలు పోవాలని subconscious mind  ని ట్రైన్ చేస్తూ మరల వాటినే చూడడం వల్ల ప్రయోజనం ఉండదు.

సమస్య పెద్దది అయినపుడు  subconscious దానిని మార్చడానికి 45 నుండి 60 రోజులు పడుతుంది. ముఖ్యంగా ఉదయం, రాత్రి పడుకునే ముందు  subconscious కి  positive affirmations  ఇవ్వాలి. ఒక్క రోజు కూడా వాటిని వాయిదా వేయకూడదు.

ఈ బుక్ చదివిన తరువాత నేను నా సమస్యలకి పరిష్కారం కనుగొన్నాను. రోజు affirmations  ద్వారా subconscious ని ట్రైన్ చేయడం వల్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. చేయవలసినది ఏమిటంటే నమ్మకం, మన affirmations  మీద నమ్మకం. ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మారుతుందనే విశ్వాసం ఉండాలి.

ఆలోచనలు మరి ఎక్కువ అయినపుడు వాటిని పేపరు మీద రాసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చించి సమస్యలు తొలగిపోయినట్లు ఊహించుకోవాలి. అలాగే doodles గీయడం ద్వారా సమస్యల ఆలోచనలను కంట్రోల్ చేయవచ్చు.

Post a Comment

0 Comments