How To Control Thoughts | ఆలోచనలను నియంత్రించడం ఎలా!

ఆలోచనలను నియంత్రించడం ఎలా!


మనిషి యొక్క ఆలోచనలు నిరంతరం నదీ ప్రవాహంల పొంగిపోర్లుతుంటాయి. మనుషులమైన మనం ఎక్కువ సమయం గడిచిన మరియు జరగబోయే వాటి గురుంచే ఆలోచిస్తుంటాము. విచిత్రంమైన విషయం ఏమిటంటే గడిచిన కాలంలో భాదాకరమైన సంఘటనలనే మనస్సు ఈ క్షనంలో మనోపలకంఫై చూపిస్తుంది. అలాగే భవిష్యత్తులో భాదాకరమైన సంఘటనలు జరుగుతాయి అన్నట్లు మనస్సు మనోపలకంఫై చూపిస్తుంది.

చాలా ఆశ్చర్యం కాదు! గతకాలంలో జరిగిన సంతోషకరమైన విషయాల గురుంచి కానీ,భవిష్యత్తులో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయని మనస్సు చాలా కొద్ది నిముషాలు మాత్రమే అనుభూతినిస్తుంది. ఆలోచనలు చాలా శక్తివంతమైనవి. ఒక ఆలోచనఫై తీవ్ర ఆకాంక్ష్య ఉన్నపుడు అది కార్యరూపం దాల్చుతుంది. ఆ కార్యరూపం అవడానికి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తుంది మనస్సు మేధస్సును ఉపయోగించి.

ఆలోచనలు నియంత్రించడానికి ఒక మార్గం ఉంది. ఎపుడైనా ఖాళీగా ఉన్నపుడు , భాదలో ఉన్నపుడు, కోపం, భయం, ఆందోళనలో ఉన్నపుడు గడచిపోయిన సంతోషకరమైన జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకొని ప్రసుతంలో అనుభూతి చెందాలి. ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చినపుడు నెమ్మది నెమ్మదిగా ఆలోచనలను నియంత్రిచగలం. నాకు తెలిసి సమయపాలన కూడా ఆలోచనల నియంత్రణకు చక్కని మార్గం.

Post a Comment

0 Comments