Cash Flow | డబ్బు మీద అభిప్రాయాలను మార్చుకోవడం ఎలా?

డబ్బు మీద అభిప్రాయాలను మార్చుకోవడం ఎలా?



ప్రపంచలో ఎక్కువమంది కొన్న పుస్తకాలలో ఈ Cash Flow బుక్ ఒకటి. రచయిత Robert Kiyosaki తన రచనలతో డబ్బు మీద ఉన్న అభిప్రాయాలను మార్చారు చాలా మందిలో.  అందులో నేను ఒకడిని. ఈ బుక్ లో నా నచ్చినా కొన్ని పాయింట్స్.

 

Success Is A Poor Teacher

నిజానికి విజయం అనేది చాలా తక్కువ పాఠాలు నేర్పుతుంది ఈ జీవితంలో. ఉదాహరణకు స్కూల్ డేస్ లో ఫస్ట్ క్లాస్ వచ్చినవాళ్ళు వారు జీవితంలో చాలా తొందరగా సెటిల్ అయినట్లు ఉండరు. అదే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఒక పెద్ద బిజినెస్ మేన్ గా మారడం ఆశ్చర్యానికి గురి  చేస్తుంది. ఓటమి నేర్పిన పాఠాలు విజయం నేర్పదు. అందుకే అంటారు ఓటమి విజయానికి తొలి మెట్టు అని.

 To Overcome My Shyness And Fear Of Rejection In Network Marketing.

మనం రోజూ చూస్తూనే ఉంటాం.  రోజు సేల్స్ మెన్ కి వారి ప్రొడక్ట్స్ తీసుకొని ఇంటింటికి తిరుగుతూ వాటిని అమ్మడానికి ఎన్ని అవస్థలు పడుతుంటారు. కానీ చూసిన అవే కళ్ళతో చూస్తే అలాంటివారు అనతికాలంలో ఎంత గొప్ప స్థాయికి, ఎంత సంపన్నులు అయ్యారో తెలుస్తుంది. ఎవరైతే సిగ్గును, అలాగే తాము తిరస్కరించబడతాము అనే భయన్ని దాటుతారో, వాళ్లు సంపన్నులుగా మారుతున్నారు. వారు తమ జీవితాలలో Rejections, Shy  కి గల కారణాలను తెలుసుకోగలుగుతున్నారు. ఇవన్నీ ఓటమి చూడటం వల్లనే వారు విజయాన్ని పొందగలుగుతున్నారు.

 

Investing Is Key To Financial Freedom

ఈ రోజుల్లో ఆర్థిక స్వేచ్ఛ అనేది చాలా అత్యవసరం. ఆర్థిక స్వేచ్ఛ లేని మనిషి జీవితం దుర్భరం. ఆర్థిక స్వేచ్ఛ పొందాలంటే దానికి ఇన్వెస్టింగ్ ఒక్కటే మార్గం. సేవింగ్స్ అనేది 10 సంవత్సరాల తర్వాత కూడా ఒకే విధంగా ఉంటుంది. కానీ ఒక సంస్థలో   ఒక ప్రోడక్ట్ పై పెట్టిన పెట్టుబడి మరిన్ని లాభాలను తీసుకురావడంలో తో పాటు అంతకంతకూ దాని విలువను పెంచుకుంటుంది. ఇక్కడ తెలియాల్సి ఏమిటంటే ఆర్థిక జ్ఞానం. ప్రోడక్ట్ లో పెట్టుబడి పెడితే లాభాలను తెస్తాయో తెలుసుకోవడం ముఖ్యం.

You Will Never Know True Freedom Until You Achieve Financial Freedom

నిజమైన స్వేచ్ఛ అనేది ఆర్థిక స్వేచ్ఛను పొందే వరకు తెలియదు. ఒక విధంగా గమనిస్తే నిండుగా డబ్బు ఉన్న వ్యక్తి ముఖాన్ని, డబ్బు లేని నిరుపేద ముఖాన్ని చూసినప్పుడు వారిద్దరిలో ప్రస్ఫుటంగా కనిపించేది ధైర్యం యొక్క స్వభావం. డబ్బు కలిగిన వ్యక్తి ధైర్యంగా మాట్లాడగలడు. ఎందుకంటే అతనికి నిజమైన స్వేచ్ఛ ఉంది కాబట్టి. రచయిత మనుషుల ఆలోచనలను, వారు చేసే పనుల బట్టి 5 లెవెల్స్ చెప్పారు. అవి

Level 1:  No Savings But Debts

ఈ వర్గంలో లో అప్పు చేసి పప్పుకుడు అనే స్థితిలో ఉంటా.రు ఈరోజు కంఫర్ట్ మాత్రమే వారికి ముఖ్యం. వారి సుఖాల కోసం అప్పు చేసయిన వస్తువులను కొంటుంటారు. వారికి రేపటి కోసం మదుపు అనే ఆలోచన ఉండదు.

Level 2: These Are Saving Money Only

ఈ లెవెల్ లో మనుషులు వారి సంపాదనలో కొంత భాగాన్ని సేవింగ్ కోసం దాచి పెడతారు. లెవెల్ వన్ తో పోలిస్తే ఇది మంచిదే. కానీ ఇలా సేవింగ్స్ అనేవి ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. ఈ సేవింగ్స్ తో డబ్బు వారి కోసం పని చేయడం మొదలు పెట్టదు.

Level 3Level ~ Level 2

They Are Giving Money To Stock Brokers

ఇందులో  వీరు ఒక అడుగు ముందుకు వేసి డబ్బును పెట్టుబడులలో పెట్టడానికి స్టాక్ బ్రోకర్ ని ఆశ్రయిస్తారు. కానీ ఆర్థిక విషయాలపై పట్టు లేకపోవడం వల్ల వారి డబ్బు వారి కన్నా స్టాక్ బ్రోకర్ కే బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల అయితే వారి డబ్బు లాస్ అన్నా అవుతుంది లేదా సేవింగ్స్ లో ఉండిపోతుంది.

Level 4:  Key To Success At Level 4 Is Lifelong

ఈ విభాగంలో లో ఎక్కువమంది గ్రేట్ టీచర్స్, గ్రేట్ కోచెస్ గా ఉంటారు. వీరు ఛాలెంజ్ ని తీసుకుంటారు. నిరంతరం ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుంటూ ఉంటారు. వీరికి ఆర్థిక విషయాలపై బాగా అవగాహన ఉండడం వల్ల ఏ సంస్థలో ఎప్పుడు ఏ ప్రాజెక్టు పై పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు బయటకు రావాలి అనేది బాగా తెలుస్తుంది. అందువలన వీరు పెట్టుబడి రంగాల్లో బాగా రాణిస్తారు.

ఈ పుస్తకంలో లో రచయిత పేర్కొన్న ప్రతి విషయం నన్ను ఆర్థిక విషయాల పట్ల అప్రమత్తుడిని చేసింది. రచయిత అంటారు

The More Information I Have, The Higher Returns And The Lower My Risk

ఆర్థిక విషయాలపై ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండడం అత్యవసరం. దానివలన నాకు ఎక్కువగా లాభాలు వస్తాయి మరియు చాలా తక్కువ  రిస్క్ నేను ఫేస్ చేయగలుగుతాను. ఈ క్యాష్ ఫ్లో  అనే బుక్ ప్రతి ఒక్కరు చదవవలసిన పుస్తకం అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహపడను.

Post a Comment

0 Comments