Bale Mogudu Movie Review | భలే మొగుడు | రాజేంద్ర ప్రసాద్| భలే మొగుడు మూవీ రివ్యూ

భలే మొగుడు



    ఒక మంచి మెలోడీ సాంగ్ వినాలంటే 2000 - 2005 సంవత్సరాల మధ్య కాలంలోని సినిమా పాటలు మంచివి అని అందరికీ తెలుసు. ఒక మంచి కుటుంబ కథా చిత్రం విజ్ఞానాన్ని వినోదాన్ని ఇస్తుంది. అలాంటి సినిమానే ఈ భలే మొగుడు. ఒక సేల్స్ మాన్ కి ఉండవలసిన మాటకారితనం, చలాకి ని నటుడు రాజేంద్రప్రసాద్ ద్వారా డైరెక్టర్ బాగా చూపించాడు. జీవితంలో ఎదగడానికి మాటలు, తెలివితేటలు ఎంత అవసరమో డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా వివరించి కలుగుతాడు. 
    
    తోటి ఉద్యోగులు సేల్స్ ఫీల్డ్ లో రాణించలేక పోవడానికి గల కారణాలను రాజేంద్ర ప్రసాద్ నటన ద్వారా బాగా చూపించబడుతుంది. ఇక కుటుంబ పరంగా కూడా ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంటుంది. తన కుటుంబాన్ని చక్క దిద్దుకోవడంగా హీరోయిన్ కు  డైరెక్టర్ ప్రముఖ పాత్ర ఇచ్చాడు. ఖాళీగా ఉన్న మరిదిని ఒక చిన్న మొబైల్ ఫుడ్ షాప్ ఓనర్ గా మార్చే హీరోయిన్ మాటలు, సంఘటనలు నిజజీవిత సంఘటనలను తలపిస్తాయి. అంతా బాగానే ఉన్నా మనుషులలో ఉన్న అహంకారాన్ని దాన్ని పోగొట్టే విధానాన్ని దర్శకుడు బాగా చూపించగలిగాడు ఈ సినిమాలు లో.

Post a Comment

0 Comments