Life Fluctuations | జీవన తరంగం

జీవన తరంగం

    
    జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సంతోషమైన చిన్ననాటి సంఘటనలు మరువలేనివి. అప్పుడే బాగుండేది అందరూ ఉండేవారు. పెద్ద అవుతున్నాను అనే ఆనందం కన్నా అందరినీ విడిచి దూరంగా ఉండి ఆ ఆనందాలను కోల్పోయానని బాధ ఎక్కువగా తొలుస్తూవుంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది భగవంతుడు సంతోషాలకు కష్టాలకు డబ్బును మధ్యవర్తిగా ఎందుకు పెట్టాడు అని.  పెరిగి పెద్దయిన మనిషికి ఏముంటుంది బతకడం తప్ప. డబ్బు అనేది నిత్య అవసరం అయిపోయింది సామాన్యుల జీవితంలో. చిన్నప్పుడు చూసిన చెట్లు మారలేదు, పక్షులు మారలేదు. కానీ సంఘంలో జీవిస్తున్నా మనిషిలో, మనిషి అవసరాలలో ఎందుకు మార్పులు వస్తున్నాయి!  పైగా అవి డబ్బు కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. 
    నిజానికి అదృష్టం అనేది లేదు అంటారు మేధావులు. అదృష్టం అనేది లేకపోతే పకీరు నవాబు ఎలా అవుతున్నాడు నేటి కాలంలో. ఒకడు నిరంతరం కష్టపడుతున్న వాడిని కనకమహాలక్ష్మి కరుణించదు, మరోకడు వింత చేష్టలు చేసినా అద్భుతమై అతన్ని కుబెరుడిని చేస్తుంది. ఈ జీవన తరంగాలలో సామాన్యులది కీలకమైన పాత్ర. డబ్బు సంపాదిస్తున్న వాడికి, సంపాదించిన వారికి సామాన్యుడే ఆటలో పావు. కనులు మూసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే  ఎన్ని మోసాలు, ఎన్ని విడ్డూరాలు తటస్తితాయో. 
    అందరిచేత గౌరవింపబడే వాడిది గెలుపు అనుకోవాలా! సర్వం త్యజించి బ్రహ్మ స్వరూపుడైన బైరాగిది గెలుపు అనుకోవాలా! ఎలా తెలుస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో విజయ పతాకం వేసిన బైరాగి గెలుపొందిన వాడైతే, బాహ్యప్రపంచంలో అత్యధిక ధనాన్ని కూడబెట్టిన వ్యాపారవేత్త గెలిచినట్లయితే, మరి సామాన్యుడి పరిస్థితి ఊట్టికి అందలేడు, నేల మీద నిలబదలేడు. ఈ జీవన తరంగాలలో ఈ విధంగానే బ్రతకమని భగవంతుడు సామాన్యుల పై రాసిన విధి వ్రాతలా! ప్రస్తుత పరిస్థితులు.

Post a Comment

0 Comments