Guna 369 | గుణ 369 మూవీ రివ్యూ

గుణ 369



ఎమోషనల్ గా ఎక్కువగా ఫీల్ అయ్యేవారు ఈ సినిమా ను చూస్తే మరింత ఉద్వేగానికి లోనవుతారు. సినిమా మొదటి భాగం మొత్తం ఫ్యామిలీ కధలా ఉంటుంది. హీరో ఒక సాధారణ వ్యక్తిలా ఉంటాడు. మధ్యతరగతి మనుషులకు ఉండే బాధ్యతలను, అనురాగాలను దర్శకుడు బాగా చూపిస్తాడు.

సినిమా రెండవ భాగం నుండి హీరోని అసాధారణ వ్యక్తిగా దర్శకుడు చూపిస్తాడు. దానికితోడు ఎమోషనల్ క్లిప్స్, స్టంట్స్  కొంచెం ఎక్కువగా ఉంటాయి. సినిమా మొదట నుండి విలన్ ని చూపించినా రెండవ భాగం నుండి పరిస్తితుల నుండి విలన్స్ ఎలా వస్తారు, పరిస్తితులు జీవితాలను ఎలా మారుస్తాయి, చెడ్డ వాళ్ళకు సహాయం చేస్తే ఎలాంటి క్లిష్ట పరిస్తితులు ఏర్పడుతాయో దర్శకుడు బాగా చూపిస్తాడు.

సినిమా ఎండ్ “నా పేరు శివ సినిమా” లాగా ఉంటుంది. ఈ సినిమా ద్వారా అజాగ్రత్తగా ఉండడం, అతిమంచితనం పనికిరాదని తెలుస్తుంది.

మెయిన్ విలన్ కి క్రొత్తగా రౌడీయిజం ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళ మధ్య జరిగిన గొడవ సామరస్యానికి హీరో చర్చలు జరుపుతాడు. ఆ ప్రయత్నంలోనే హీరో జీవితం తలక్రిందులు అవుతుంది. దాని వల్ల చేయని తప్పుకు జైలుకు వెళ్తాడు. తిరిగి వచ్చి దానికి కారణం అయిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకొని

గుణ369 గా మారుతాడు.

Post a Comment

0 Comments