MS Dhoni | M.S. ధోని మూవీ రివ్యూ

M.S. ధోని


క్రికెట్ అభిమానులకు ఒక మంచి inspiration సినిమా. ఇది కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే అని చెప్పలేము. ఎందుకంటే చిన్నప్పటినుండి తన లక్ష్యాన్ని చేరుకునే వరకు ధోని ఎంత కష్టపడ్డాడో, అవాంతరాలను ఎలా ప్రక్కన పెట్టాడో దర్శకుడు బాగా చూపిస్తాడు. విజయం కోసం పరుగెత్తే ప్రయత్నంలో చుట్టూవున్న సమాజం నుండి చాలా అవాంతరాలు వస్తాయి. వాటిని కనీసం మనస్సులోనే కాకుండా, అసలు వాటిని పట్టించుకోకూడదు. దీనిని సినిమాలో దర్శకుడు బాగా చూపిస్తాడు.

ఓటమి నుండి ఎలా నేర్చుకోవాలో, ఓటమిని కూడా అవకాశంగా ఎలా చూడాలో ధోని వ్యక్తిత్వం ద్వారా ఈ సినిమా లో తెలుస్తుంది.

ధోనికి ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం. చిన్నతనంలో ధోని ఆటను చూసి స్కూల్ మాస్టర్, ఆతరువాత  తల్లి ప్రోత్సహిస్తారు. ధోని కౌమార దశలో తండ్రి ప్రోత్సహిస్తాడు.

మొత్తానికి ఒక మంచి వ్యక్తిత్వాన్ని, న్యాయకత్వ లక్షణాలను చూడాలన్న, ఆటంకాలను ఎలా దాటాలో 

తెలుసుకోవాలన్న ఈ సినిమా చూడవలసిందే.

Post a Comment

0 Comments