What is The Profit of Educated |చదువుకుంటే ఏమి లాభం!

చదువుకుంటే ఏమి లాభం!


నేను ఒక రోజు రేషన్ షాప్ కి వెళ్ళాను. అక్కడ ఒక అతను ఒక షీట్ చూపించి ఏదో అడిగాడు. అది నాకు తెలియదు. నేను తెలియదు అన్నాను. కానీ అతను చదువుకున్నావుగా చెప్పలేవా అన్నాడు గట్టిగా అందరిముందు.
ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో తారాసపడుతుంటాయి ఏదో ఒక చోట. అస్సలు చదువు సంస్కారాన్ని ఇస్తుంది. అంటే ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి,ఇతరులతో మాట్లాడేటపుడు ఎలా మర్యాదగా, గౌరవంతో  ప్రవర్తించాలన్నది.
మన సమాజంలో పేరు ప్రక్యతలు అనేవి మనుషుల మనస్సులలో పాతుకుపోయాయి. ప్రశాంతత,సంతోషన్ని కలిగించని ఏ పని కూడా పేరు ప్రక్యతలు తిసుకురాదు. పెద్ద చదువులు చదివినా వ్యవసాయం లేదా వ్యాపారం చేయాలనుకుంటే.. మరి ఇన్ని సంవత్సరాలుగా చదివిన చదువుకు అర్ధం ఏమిటని ప్రశ్నిస్తుంది సమాజం. ఇంకా ఉద్యోగమే ఉత్తమమైనదని ఉచిత సలహా కూడా ఇస్తుంది. తనిదెంపోయింది నోటి మాటేగా.
చదువుకుంటే వచ్చేది జ్ఞానం. అది విజ్ఞానంగా మారాలంటే జీవితంలో అనుభవ రూపంలో పొందాలి. చదువుకున్న వారికి అన్ని తెలుసు, వచ్చు అని కాదు అలాని చదువుకోలేనివారికి ఏమి రావు అని కాదు. పుస్తక జ్ఞానం లోకజ్ఞానం పొందడానికి దోహదపడాలి. కానీ ఈనాటి పరిస్థితులు అందుకు విభిన్నంగా ఉన్నాయి. పుస్తక జ్ఞానం ప్రపంచజ్ఞానంతో ముడిపడే సూత్రం కనుగొనబడాలి.

Post a Comment

0 Comments