The Power of Letter |అక్షరాలకు అంతటి శక్తి ఉందా!


అక్షరాలకు అంతటి శక్తి ఉందా!

నిజమే అక్షరం యొక్క శక్తిని నేను విశ్వసిస్తున్నాను. మాటలు మనోభావాలను నొప్పించేటట్లు ఉండవచ్చు ఒక్కో సమయంలో. కానీ అక్షరాలనుపయోగించి మనస్సులో ఉన్న మంచిని రెండు వరుసలలో చూపించిన ఆ అక్షరాలు వాటి చైతన్యాన్ని ఉద్గారిస్తాయి ఈ లోకంలోకి. ఎలాగంటే వివేకానందుడు చెప్పిన..

“కెరటం అంటే నాకిష్టం, లేచి పడుతున్నందుకు కాదు.. పడి లేస్తున్నందుకు”

ఈ అక్షరాలు నా మనస్సును స్పృశించాయి. వాటిలో ఉన్న శక్తి భావరుపంలో నా కళ్ళెదుట కనబడ్డాయి. రాకాసి అలలు లాంటి కష్టాలు మనిషిని కృంగదియాలని చూస్తుంటాయి. కానీ జీవితంలో సంతోష క్షణాలు లాంటి కెరటాలు కూడా ఉంటాయి. అవి ఒడ్డుకు చేరుస్తాయి.

అక్షరాల యొక్క శక్తిని చూడాలంటే ముందుగా కొన్ని అక్షరాల కూర్పుగా ఉన్న పదాల యొక్క విలువను గుర్తించాలి. ఏ పదాలయితే మన చుట్టూ, మనలో మంచి వాతవరణాన్ని సృష్టించగలవో వాటిని మాటల్లో ఉపయోగించాలి. ఉదాహనకు

ఒక వ్యక్తి స్వర్గస్తులయ్యారు అనడానికి, మరణించారు అనడానికి చాల అర్ధం ఉంది. స్వర్గస్తులయ్యారు అనగ ఒక పాజిటివ్ సంకేతాన్ని ఇస్తుంది. అందుకేనేమో ఆఫీసులలో మోనిటర్ల దగ్గర స్టిక్కీ నోట్స్ కనబడతాయి ఒక మంచి పాజిటివ్ సంకేతాన్ని ఇవ్వడానికి అక్షరాల సుముదయంతో....

Post a Comment

0 Comments