Action Movie Review | యాక్షన్ మూవీ రివ్యూ | విశాల్

యాక్షన్ మూవీ  రివ్యూ | విశాల్

తమిళ దర్శకత్వంతో నిర్మితమైన సినిమానే యాక్షన్. కానీ హీరో విశాల్ నటన తెలుగు వాళ్లను కూడా అబ్బురపరుస్తుంది. పొలిటికల్ యాక్షన్ తో ఆర్మీని  జోడించి మిస్టరిని చేదించే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో నాకు బాగా అర్థమైంది అబ్జర్వేషన్ స్కిల్స్.  ఒక మీటింగ్లో మినిస్టర్, తర్వాత విశాల్ అన్న చంపబడతాడు. వాళ్లను ఎవరు ఎందుకు చంపారు అనే మిస్టరీ మిస్టరీ మీదనే సినిమా మొత్తం ఉంటుంది. ఆర్మీలో కల్నల్ గా పనిచేస్తున్న విశాల్, హీరోయిన్ తమన్నా ఈ మిస్టరిలో కీలక పాత్ర అవుతారు. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో చూపించడం జరుగుతుంది. విశాల్ ఫైట్ సీన్స్ , గ్రాఫిక్స్ అమాంతం కళ్ళను కట్టిపడేస్తాయి. సినిమా మొదటి భాగం ఇండియా లో ఉంటుంది. కానీ సెకండాఫ్ ని మాత్రం ఇస్తాంబుల్, పాకిస్తాన, లండన్ లొకేషన్ లో చూపిస్తారు. కామెడీ పరంగా తక్కువే కానీ యాక్షన్, మిస్టరీ, అడ్వెంచర్ కోణాలలో దర్శకుడు బాగా తెరకెక్కించాడు. తెలుగు సినిమాలలో లేడి విలన్ కు తక్కువ పాత్ర ఉంటుంది. కానీ ఈ సినిమాలో దాన్ని కొంచెం హైలెట్ చేశారు.


Post a Comment

0 Comments