Time Observing My Path | కాలం నన్ను గమనిస్తున్నట్టుంది నా గమనాన్ని!

కాలం నన్ను గమనిస్తున్నట్టుంది నా గమనాన్ని!

నేను ఒక మధ్యతరగతి వ్యక్తిని. నాన్న , అమ్మ నా చదువులకోసం చాలా కష్టపడ్డారు . కష్టపడుతున్నారు కూడా నాకు ఉద్యోగం వచ్చిన సరే . ఎందుకంటే నా జీతం ఒక సగటు మనిషి కనీస అవసరాలకు ఎంత ఖర్చు అవుతుందో దానికే సరిపోతుంది. అమ్మకు ఒక్క చీర ఐన కొని ఇవ్వలేకపోయాను. నాన్నను బండిపై ఎక్కించుకొని ప్రపంచాన్ని చూపించాలని ఉంది. కానీ ఎలా!

20 సంవత్సరాల చదువు నాకు విజ్ఞానాన్ని, సంస్కారాన్ని ఇచ్చాయి కానీ సమాజంలో ఎలా నిలబడాలో చెప్పలేదు, నడిచే మార్గాన్ని చూపలేదు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి, నాలాంటి యువకులను చూసి ఏదో చేయాలనీ కసి ఆవిర్బవించింది నాలో. నేనే కాదు చదువు పూర్తి చేసుకుని బయట ప్రపంచంలో అడుగుపెట్టిన యువత గుండెల్లో కనిపించే వ్యద ఇది.

సమాజంలో గుర్తింపు కోసం బ్రతకలా ! జీవితాన్ని జీవించడానికి జీవించాలా!

తెలుసు , నిత్యం జీవితం లో పోరాడుతున్నానని . అడుగులు వేయాలి ఆశయాల పల్లకి వైపుకి , కుడగాట్టాలి శక్తినంతటిని లక్ష్యాన్ని చేరుకోవడానికి .

నా చేయ్యిని దృడంగా చెయ్యాలని ఉంది కొన్ని వేల మందికి ఆకలి తిర్చేవిధంగా, ఆర్దిక ఇబ్బందులు తొలగించేవిధంగా.

గమనం... ... జీవితగమనం                                                      

కాలం నన్ను గమనిస్తున్నట్టుంది నా గమనాన్ని!

Post a Comment

0 Comments