Why Fathers always doing Hard Work | నాన్న ఎప్పుడూ కష్టపడతాడెందుకు?


నాన్న ఎప్పుడూ కష్టపడతాడెందుకు?


అవి నా చిన్ననాటి రోజులు. ఆటలు ఆడుకుంటున్న నేను నాన్న సాయంత్రం పొలం నుండి ఇంటికి రాగానే నాన్నను గట్టిగా హత్తుకొని నాన్న కేరేజ్ బాక్స్ తడిమేవాడిని. నాన్న మధ్యాహనం రైతు ఇచ్చిన మిర్చిరి పొట్లం తను తినకుండా నా కోసం తెచ్చేవాడు. దాని కోసం.

అమ్మ ప్రొద్దునే 3 గంటలకు లేచి వంట వండి నాన్నకు కేరేజ్ ఇచ్చేది. నాన్న అది తీసుకోని పొరుగు ఊరికి పనికి వెళ్ళేవాడు సైకిల్ త్రొక్కుతూ. నాన్న అంత కష్టపడుతున్నాడు ఎందుకో!

నేను కాలంతో పాటు పెరుగుతున్నాను. ఒక రోజున నాకు అర్ధమయ్యింది. నాన్న కష్టం నా కోసమేనని. నా చదువులకోసం, నాకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసమేనని. నేను తనలా కాయ కష్టం లోని బాధను అనుభవించకుడదని. నేను ఉద్యోగం తెచ్చుకొని హాయిగా ఉండాలని.

అవును... ప్రతి తండ్రి తన బిడ్డల కోసం ఆహో రాత్రుళ్లు కష్టపడతాడు.

నాన్నకు చర్మం ముడతలు పడే వయస్సు వచ్చేస్తుంది. నాన్న కష్టాన్ని చూసి నా హృదయం ధ్రవించిపోయింది.
నా కోసం శ్రమిస్తున్న నాన్నకు ఈ జగత్తే మెచ్చుకొనేల కానుక ఇవ్వాలి, భాద్యతలను పూర్తిగా నా భుజంఫై ఎత్తుకోవాలి.

Post a Comment

0 Comments