What is Interview | నా మొదటి ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే!


నా మొదటి ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే!

ఈ సంఘటన చాలా మందికి ఎదురయ్యేవుంటుంది. స్నేహితుడి Resume తీసుకోని అందులో నా డేటా పెట్టి, జిరాక్స్ తీసుకోని ఒక చిన్న కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ 10 మంది వెయిటింలో ఉన్నారు. వెళ్ళి కూర్చొన్నాను. ఒక ప్రక్క మనస్సు ఉద్యోగం వస్తుందో,రాదో అని సతమతపడుతుంది. వస్తే కోరికలను ఇప్పుడే లిస్టు పెట్టుకుంది. రాకపోతే జరగబోయే పరిణామాలను చెప్పి భయపెడుతుంది.


అస్సలు ఆ క్షణంలో ఎలా ప్రవర్తించాలో మాత్రం చెప్పదు. నిజానికి మన చుట్టూ ఉన్న వాతావరణం ఇంటర్వ్యూని ఒక తారాస్తాయి  చేసింది. ఇంటర్వ్యూ అంటే మనకు తెలిసిన విషయాలను పంచుకోవడం.
ఇంకా అక్కడున్న సమస్యలను పరిష్కరించగాలనని, అక్కడున్న వాతావరణానికి అనుకూలంగా ఉండగలనని ఆత్మవిశ్వాసాన్ని మాటల ద్వారా చూపడం.

ఎప్పుడు కుడా ఒక పని యొక్క ఫలితాన్ని చూడకూడదు. ఆ క్షణంలో ఆ సంఘటన ద్వారా నేర్చుకోబోయే విషయాలపై దృష్టిపెట్టాలి.

ఇంటర్వ్యూ పూర్తియిన తరువాత ఆ సంఘటనను విశాదికరించుకోవాలి కొంత సమయం కేటాయించి. అప్పుడు ఆ కంపెనీ ఎటువంటి నైపుణ్యాన్ని కోరుతుంది, నువ్వు ఏవిధంగా సమాధానం ఇచ్చావు అన్నది విశ్లేషించుకోవాలి. ఇదంతా పేపరు ఫై అక్షరరూపం ఇచ్చినపుడే సాధ్యమౌతుంది. 

20 సంవత్సరాలు నేర్చిన విజ్ఞానాన్ని ఒక్క ఇంటర్వ్యూ  నిర్ణయిస్తుందా! కాదు కదా!

Post a Comment

0 Comments