సమయాన్ని కొలవడం సాద్యమా? | How do we measure time.

సమయాన్ని కొలవడం సాద్యమా!

మొదటి భాగం
ఈ ప్రపంచంలో దేనినైన కోలోవచ్చేమో గాని కాలాన్ని కొలవడం!
ప్రతి ఒక్కరు రోజుకి 24 గంటల సమయమే. కానీ కొందరు తమ పనులలో బిజీ అవుతుంటారు. ఇంకొందరు హాయిగా జల్సా చేస్తుంటారు.
నా ఫ్రెండ్ ఒక కాలాన్ని కొలవడం మొదలుపెట్టాడు. ఎలా అంటారా!
రోజు తను ఏమి చేయాలో రాసుకోవడం, ఆ పని పూర్తయిన తరువాత వాటికీ టిక్స్ పెట్టుకోవడం. బాగానే ఉండి కానీ ఒక రోజు అతనికి నిరుత్సాహం వచ్చింది. రోజు ఇలా బిజీ అయిపోతున్నాను ఎంజాయ్ చేసేదేపుడు అని.
అంతే అతని to do list  బ్రేక్ అయిపొయింది.
మెషిన్ కి షెడ్యూల్ పెడితే అవి చేసుకుంటూ పోతాయి. ఎందుకంటే వాటికీ మైండ్, ఫీలింగ్స్ లేదు కాబట్టి.
కానీ మనిషికి ఫీలింగ్స్,మైండ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి రిలీఫ్ కోసం వారంలో ఒక రోజు, రోజు 30 నిమిషాలు ఖచ్చితంగా కేటాయించాలి. అప్పుడే అవి మనల్ని సమయాన్ని కొలవడానికి సహకరిస్తాయి. ఇక్కడ సమయానికి కొలమానం చేయవలసిన పనులను వాయిదా వేయకుండా చేయడం. ఇంకో విధంగా చెప్పాలంటే To Do List అన్నమాట.
ఇప్పుడున్నది Information Era. కుప్పాలు తెప్పలుగా ఇన్ఫర్మేషన్ వచ్చిపడుతుంది. అందువల్ల సమయాన్ని కొలవడం అత్యవసరం. To Do List పెట్టుకున్న రోజును, అలాగే To Do List లేని రోజును గమనిస్తే అది వివరంగా అర్ధమవుతుంది.

రెండవ భాగం

   అసలు నా వరకు వస్తే సమయాన్ని కొలవడం అంటే కాలాన్ని సంతోషకరమైన వాటికి వినియోగించాలి అంటాను. అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం,స్నేహితులు తో స్పెండ్ చేయడం, క్రొత్త ప్రదేశాలు చూడటం, స్వచ్ఛంద సేవా సంస్థల క్యాంపెన్లో పాల్గొనడం, నచ్చింది చేస్తూ సంపాదించడం.

         ఉద్యోగం చేయడం నచ్చిన పని అనలేము. ఒక పెద్ద NGO లో పనిచేస్తుండటం గొప్ప విషయం అవుతుంది. ఎందుకంటే కొంచెం ఒత్తిడి ఉన్నా సమాజానికి మేలు చేసే సంస్థలో తన వంతు బాధ్యతగా పనిచేయడం కొంచెం సంతోషాన్నిస్తుంది. కానీ లోభనికి గురైన వ్యక్తి డబ్బు కోసం పని చేస్తాడు. అతడు 100% సంతోషాన్ని కాలాన్ని కొలవడం సాధ్యం కాదు అని చెప్పవచ్చు.
                
         కాలాన్ని కొలవడం అంటే ముందుగానే మన జీవితంలో సంతోషకరమైన సంఘటనను డిజైన్ చేసుకోవడం. ఈ సంఘటనను మరల తలుచుకున్నప్పుడు ప్రస్తుతాన్ని అవి మార్చగలవో అటువంటి సంఘటనలు కాలాన్ని కొలవడానికి ఉపయోగించాలి. ఉదాహరణకు ప్రకృతిని ఆస్వాదించిన సంఘటనలు, స్కూల్ లో బెస్ట్ ప్రైస్ తీసుకున్నప్పుడు వినబడిన చప్పట్లు కూడా కావచ్చు. కానీ సినిమా, ఇతరులతో గొడవ పడిన సందర్భాలు, జీవితంలో వెనుకబడిన సంఘటనలు తలచుకున్న అవి ప్రస్తుతాన్ని మార్చక పోగా మరింత విషాదంలో కి నెట్టి వేస్తాయి. ఇలాంటి వాటితో కాలాన్ని కొలవడంమా!

             ఇప్పుడే పెన్ మరియు పేపర్ తీసుకోవాలి. ఒక సంవత్సరం కు సరిపడా సంతోష సంఘటనలు రాసుకోవాలి. బడ్జెట్ ని ప్లాన్ చేసి మైండ్ కి రాబోయే నెలల్లో ఏ చోట ఎవరెవరితో కాలాన్ని స్పెండ్ చేస్తున్నాము అన్నది ఊహించుకోవాలి. మనసుకు దానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఆటోమేటిక్ గా నిజజీవితంలో సందర్భాలు దానికి అనుకూలంగా మారతాయి. ఎక్కువసార్లు ఊహాగానం చేస్తే అవి తొందరగా స్పురణకు రావడం జరుగుతుంది. My Life Experiences Hub నిజ జీవిత సంఘటనలను ఎప్పుడూ అక్షర రూపంలో భద్రపరుస్తుంది అని నిస్సందేహంగా చెప్పగలను.

          అనుభవం అక్షర రూపం దాల్చినప్పుడు వాటిని మరింత మందితో పంచుకోగలుగుతునన్న ఆనందం ఎక్కువగా ఉంటుంది. కాలాన్ని కొలవడం లో నేను ఉపయోగించే టూల్ సంతోషకరమైన సంఘటనలు.

Post a Comment

0 Comments